స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత పాలకులు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, హైదరాబాదుకు ధీటుగా రెండో నగరంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు.