జనగాం జిల్లాలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బృందం పర్యటించింది. సోమవారం జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సారథ్యంలో జిల్లాలోని బచ్చన్నపేట, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాలలో ఈ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పలు గ్రామాల్లో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.