ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. ప్రతి క్షణం తెలంగాణ ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం కష్టపడుతున్న సీఎం రేవంతన్నకు తాము అండగా ఉంటామన్నారు. వరంగల్ ను సొంత ప్రాంతంలా చూస్తున్న సీఎం రేవంతన్నకు థ్యాంక్స్ చెప్పారు. గత ప్రభుత్వంలో స్టేషన్ ఘనపూర్, ఇతర ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.