

వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలి: వరంగల్ జిల్లా కలెక్టర్
వేసవిలో నీటి కొరత లేకుండా , వృదాను అరికట్టి స్వచ్ఛమైన త్రాగునీటిని ఇంటింటికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి, వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజలకు ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి, నర్సంపేట నియోజక వర్గ ప్రజలకు పాలేరు రిజర్వాయర్ నుండి నీటి సరఫరా జరుగుతుందని, ఫ్లోరినేషన్ చేసి ప్రజలకు నీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు.