
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ ఎంపీ
ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్నిరూపుమాపే గొప్పపండుగల్లో ఒకటి రంజాన్ అని అన్నారు.