దామర మండలం ఒగులాపూర్ సైలని బాబా దర్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులంతా రంజాన్ పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు.