మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్ గా గుల్షన్ ఈద్గా లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలన్నారు.