ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి లోని చౌకధరల దుకాణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.