ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో ఆందోళన చేస్తున్న మహిళా కళాకారులను బయటకు పోలీసులు తోసేసారు. సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో మహిళా కళాకారులు ఆందోళన చేపట్టారు. చిన్న పిల్లలతో వచ్చిన తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని మహిళా కళాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు.