పరకాల నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 4వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి లలిత కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహించే పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు.