

స్టేషన్ ఘనపూర్: గిరిజన వేషధారణలో సంప్రదాయ నృత్యం చేసిన ఎంపీ కావ్య
286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో బుధవారం ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. గిరిజన వేషధారణలో బంజార మహిళలతో కలిసి, సంప్రదాయ నృత్యంను ఎంపీ కడియం కావ్య చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో కడియం ఫౌండేషన్ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందన్నారు.