తెలంగాణ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రిని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కలిశారు. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ గా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరారు. కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్‌గ్రేడ్ చేయాలని వినతిపత్రం అందజేసారు.