స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని శివునిపల్లి గ్రామంలో మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. తదుపరి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం సందర్శించారు. ఈ స్టాల్స్ ప్రత్యేకతలను నిర్వాహకులు సీఎం కు వివరించారు.