హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవానికి మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరుకోగా, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్ మేయర్, కమిషనర్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు.