
కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య
ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ కృష్ణసార్ రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను (21) తల్లి మందలించిందని మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుందని తెలిపారు. మృతురాలి తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.