నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ విద్యార్థులు ఔదార్యం ప్రదర్శించి తలా గుప్పెడు బియ్యాన్ని 4 రోజులపాటు ఇంటినుండి తెచ్చి జమచేసిన బియ్యాన్ని, 500 రూపాయలను నిరుపేద నర్సయ్యకు గురువారం అందించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో HM బోనగిరి నరేందర్ రావు, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, జాడి శ్రీనివాస్, తొంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.