కడెం ప్రాజెక్టును ప్రాజెక్టు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్ సమస్యలు, వరద గేట్లను పరిశీలించి, ప్రాజెక్టు స్థితిగతులను ఎస్ఈ రవీందర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఐడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, స్టేట్ డ్యాం సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల, ఈఈ విజయలక్ష్మి, ఎఈఈ సౌందర్య ఉన్నారు.