

ఖానాపూర్: ఆలయాల్లో చోరీ.. ఇద్దరు దొంగల అరెస్ట్
ఖానాపూర్ పట్టణం కొమురం భీం చౌరస్తాలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, తర్లపాడ్ అగ్గి మల్లన్న ఆలయాల్లో ఇటీవల చోరీకి పాల్పడ్డ నిందితులను సోమవారం ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సీహెచ్ అజయ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. రాజు, రాజశేఖర్ ఈ నెల 9వతేదీన రాత్రి వేళ ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని వెల్లడించారు. వారి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.