పెంబి మండల కేంద్రంలోని హరిహర దేవాలయ 17వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలపై ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్నిల్ రెడ్డి, రమేశ్వర్ రెడ్డి, శంకర్, శంకర్, మోహన్ రెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.