కడెం: ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని రైతుల ధర్నా

77பார்த்தது
దస్తురాబాద్ మండలం దేవునిగూడెం గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమకు కడెం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కడెం మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ముందు సుమారు 60 మంది రైతులు ధర్నా చేపట్టారు. అధికారులు స్పందించి పంట పొలాలకు నీరు అందించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி