ఖానాపూర్ చౌరస్తాలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బంగారు పుస్తెలు, తొమ్మిది గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, ఆలయ హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.