నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఆదివారం ఉగాది పండుగను రైతులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే రైతులు తమ పంట పొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి తొలి దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. వర్షాలు బాగా పడి పంటలు పుష్కలంగా పండాలని మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం పంట పొలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాలు చేశారు.