ఖానాపూర్: పాఠశాలలో మాతృ పితృ వందన కార్యక్రమం

58பார்த்தது
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శుక్రవారం మాతృ పితృ వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుమారు 50మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలకు పూజా చేసి కాళ్ళు కడిగిన నీళ్లను తలపై చల్లుకున్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు ఆశీర్వదించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉద్దేశంతో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు.

தொடர்புடைய செய்தி