కడెం మండల కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాండవాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పెద్దూరులోని హనుమాన్ ఆలయం వరకు వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి స్వామివారి దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.