
దస్తూరాబాద్: నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం దస్తూరాబాద్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాలపై అవగాహన కల్పించారు. తహశీల్దార్ సర్ఫరాజ్ నవాజ్, ఏపీఎం గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.