జన్నారం మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్ నగర్లో ఉన్న రామాలయంలో శ్రీ సీతారాముల విగ్రహాలను వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.