ఖానాపూర్ పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడడంతో ఇటీవల కాలనీ వాసులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సోమవారం డబుల్ బెడ్ రూమ్ కాలనీ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.