పేదల కడుపు నింపడానికే రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం దస్తూరాబాద్ మండలంలో బుట్టాపుర్ గ్రామంలోని చౌకదారుల దుకాణం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు సన్నబియాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.