తెలంగాణలో గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని? ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ ను BRS నేత జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదని మండిపడ్డారు. 'నీళ్లు ఇవ్వమంటే రైతుల పొలాలు వేసుకోరు.. నేడు నీళ్ళు ఇస్తామని ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారు. ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుంది. ధాన్యం కొనుగోళ్లపై సీఎం ప్రకటన చేయాలి' అని డిమాండ్ చేశారు.