తెలంగాణ ప్రభుత్వం.. ఏపీలో కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడత 12,500 టన్నుల MTU 1010 రకానికి చెందిన బియ్యం పంపించడానికి సోమవారం శ్రీకారం చుట్టింది. తాజాగా ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి వెంట ఫిలిప్పీన్స్ ప్రతినిథులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.