టీడీపీ కార్యకర్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమాను మరింత పెంచుతున్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ కోరుకుంటారని, వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు హెరిటేజ్ అనే విత్తనం నాటారని గుర్తు చేశారు. మా కుటుంబ ఖర్చుల కోసం రాజకీయాలపై ఆధారపడి లేమని స్పష్టం చేశారు.