సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కడియం కావ్య
ఉచిత చేప పిల్లల పంపిణీలో ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలను వరంగల్ ఎంపీ కడియం కావ్య చేశారు. తినడానికి , తాగడానికి గత పాలకులు పనిచేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏదో పొడిచేస్తం అని పగటి కళలు కంటున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని సిగ్గు లేకుండా ఊహల్లో బ్రతుకుతున్నారన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఉచిత చేప పిల్లల పంపిణీ అనంతరం చేసిన వ్యాఖ్యలు చేశారు.