

భూపాలపల్లి: కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు
ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని ధన్వాడ సబ్ స్టేషన్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు 33/11కెవి ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. కాటారం గ్రామ పంచాయతి కార్యాలయంలో రూ 50 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి భవనం, కోటి రూపాయలతో స్పోర్ట్స్ కు సంబంధించిన కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.