యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలో జాబ్ మేళా నిర్వహించే టాస్క్ కంపెనీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సీఐలు, ఎస్సైలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పాల్గొన్నారు.