భూపాలపల్లి జిల్లాలో 21 నెలల బాలుడు కార్పెంటైన్ ఆయిల్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడ మమత, నరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సుహాన్ ను తీసుకొని తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ పెయింట్ బ్రష్‌లు కడిగేందుకు ఉంచిన కార్పెంటైన్ ఆయిల్‌ను తాగి బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయాడు.