
సేవాభావం చాటిన భూపాలపల్లి బీజేపీ నాయకులు
మహాముత్తారం మండలం రెడ్డిపల్లి కి చెందిన గిరిజన బాలుడు రాజేష్ చిట్యాలలో పరీక్ష రాసేది ఉండగా లింగాల నుండి సమయం అవుతున్నదనే తొందరలో బైక్ పై అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి బైకు పడడంతో బైక్ పై వెళుతున్న రాజేష్ అనే గిరిజన అబ్బాయికి కాలు విరగడం జరిగింది. అటువైపు వెళుతున్న భూపాలపల్లి బిజెపి నాయకులు సామల మధుసూదన్ రెడ్డి గమనించి వెంటనే 108 కి ఫోన్ చేసి ఆ అబ్బాయిని వంద పడకల ఆసుపత్రికి తరలించి సేవా భావం చాటుకున్నారు.