భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన తెలిపారు. అనంతరం సీపీఐ పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని అన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే, ఆదుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు.