భూపాలపల్లి కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఆదివారం సాయంత్రం ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. యాత్ర మధ్యలో పలువురు మహిళలు ఎమ్మెల్యేకు కుంకుమ పెట్టి, శాలువాలు కప్పి, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.