నిర్మాణంలో ఉన్న పుష్కరాల పనులన్ని మే 4వ తేదీ వరకు పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కాళేశ్వరంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా విఐపి ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంప్ నిర్మాణం, సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న పనులను పరిశీలించారు.