గత ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు వెంటనే కాంగ్రేస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని శనివారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి వద్ద బైఠాయించి లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. వారికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం ద్వారా గుర్తించిన లబ్ధిదారులకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.