భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ అంటే అందరివాడని కేవలం ఎస్సీలకు మాత్రమే అంటగట్టడం సరికాదని, ఏప్రిల్ అంటేనే మహనీయుల మాసం అని, ఈ మాసంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు.