జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం స్వచ్ఛందంగా నిర్వహించారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మాజీ జిల్లా పరిషత్ సభ్యులు గిరి కొండల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివయ్య, ఇట్టబోయిన కనకచంద్రం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.