మహబూబాబాద్ పట్టణంలోని 26వ వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్లు పునరుద్ధరణ చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ నిర్వహించి నిరసన చేపట్టారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ మాట్లాడుతూ మండుతున్న ఎండలో వార్డులో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలో అన్ని వార్డులలో మిషన్ భగీరథ పైప్లైన్ వేసి ప్రజలకు నీళ్లు అందించాలని కోరారు.