భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్ట్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే గ్రామాన్ని తరలించి, వేరే చోట పునరావాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ముందు గురువారం పరశురాంపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల కాలుష్యం పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదన్నారు.