సంగారెడ్డి: ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్-327 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో సర్కిల్ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని చెప్పారు. సర్కిల్ అధ్యక్షునిగా వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్, కోశాధికారిగా వెంకటేశం ఎన్నికయ్యారు.