
వరంగల్: ఉగాది మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించేది: మంత్రి
రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ వాసులకు మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించేది మాత్రమే కాకుండా, నూతన ఆశలు, కొత్త లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన శుభదినమన్నారు.