రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, తూనికలు కొలతలు, తదితర శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు.