వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చ్ 31 తో ముగిస్తున్నందున నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని జిడబ్ల్యూఎస్సి కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఓటిఎస్ గడువు మార్చి 31 తో ముగుస్తున్నందున మార్చి 30, 31 తేదీలు రెండు రోజులు సెలవు దినాలు ఉన్నప్పటికి సిటిజన్ సర్వీసు సెంటర్, మీ సేవా కేంద్రాలు పని చేస్తాయని, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు.