వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 120 అర్జీలను అందజేశారు. ప్రజల నుండి అందిన వివిధ సమస్యలను త్వరగా పరిష్కరించలన్నారు.