

వరంగల్: ఆసరా స్టోర్ ను ప్రారంభించిన కలెక్టర్
మహిళా సంఘ సభ్యులు గ్రూపుగా ఏర్పడి సామూహికంగా వ్యాపార రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో ఆసరా స్టోర్ ను ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో హనుమకొండ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఆసరా స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.